
దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే మాస్, మసాలా, ఎమోషన్ అన్నీ పక్కాగా ఉండే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆయన తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ విక్రమార్కుడులో రవితేజ డ్యూయల్ రోల్స్‌లో అదరగొట్టాడు. ఇందులో “కాలేజ్ పాపల డ్రస్సు” పాట యువతను ఊపేసింది. ఈ పాటలో “టెన్నిస్ అమ్మడు కోర్టంతా దున్నుడు” అనే లిరిక్‌లో కనిపించిన హీరోయిన్ గుర్తుందా? ఆమె పేరు కౌశా రచ్ (Kausha Rach).
కౌశ అనేక చిత్రాల్లో నటించింది. దిల్, మన్మధుడు, ప్రేమాయ నమ:, అత్తిలి సత్తిబాబు LKG, రారాజు వంటి సినిమాలతో పాటు మంత్ర, కుబేరులు, బ్లేడ్ బాజ్జీ, ఇందుమతి, సిద్ధు ప్లస్ 2, బ్రోకర్, మహంకాళి లాంటి చిత్రాల్లోనూ కనిపించింది. కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం ఆమెను పెద్దగా పలకలేదు. టాలెంట్ ఉన్నప్పటికీ, పెద్ద స్థాయి గుర్తింపు మాత్రం దక్కలేదు.
ఇటీవల కౌశ సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ కాకపోయినా, కొన్నిసార్లు తన ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమెను ఫాలో అయ్యే నెటిజన్లు ఇంకా బాగానే ఉన్నారు. ఆమె హాట్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన కొన్ని Instagram ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. విక్రమార్కుడు తర్వాత ఆమె కెరీర్ ఎలా సాగిందో, ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తుందా అనే చర్చలు నడుస్తున్నాయి. మరి త్వరలో కౌశ మళ్లీ తెరపై కనిపిస్తుందా? చూడాలి మరి!