Published on Jan 4, 2025 1:10 PM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “గేమ్ ఛేంజర్” రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చరణ్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అయితే లేటెస్ట్ గా చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేయడం జరిగింది.
అయితే ఈ వీడియోలో తమ కూతురు క్లిన్ కారా కొణిదెల మొట్ట మొదటిసారిగా తన నాన్న నటించిన రామ్ చరణ్ నటించిన సినిమా RRR చూస్తుంది అంటూ ఉపాసన పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక నెక్స్ట్ గేమ్ ఛేంజర్ అంటూ పోస్ట్ చేసారు. దీనితో ఈ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ పోస్ట్ ఇపుడు మెగా అభిమానుల్లో మంచి ఎమోషనల్ గా మారింది అని చెప్పాలి. మరి రెండో సినిమాగా గేమ్ ఛేంజర్ ని క్లిన్ కారా తన నాన్నతోనే కలిసి చూస్తుందేమో మరి చూడాలి.