Vishal : మాట్లాడలేని స్థితిలో విశాల్.. అసలేమైంది..?

హీరో విశాల్ తమిళ్ తో పాటు తెలుగులోను పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పందెం కోడి, పొగరు,భరణి, పూజా వంటి సూపర్ హిట్ సినిమాలు విశాల్ కెరీర్ లో ఉన్నాయి. కాగా విశాల్ నటించిన చివరి సినిమా మార్క్ ఆంటోనీ. విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత విశాల్ బయట కనిపించి చాలా కాలం అవుతుంది.

తాజాగా విశాల్ నటించిన 12 ఏళ్ళ క్రితం నాటి సినిమా ‘మదగజరాజ’ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ పరిస్థితి చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత బయటకు వచ్చిన విశాల్ అనారోగ్యానికి గురైనట్టు కనిపించాడు. మొఖం అంతా వాచిపోయి, మాట్లాడుతున్న సమయంలో చేతులు వణికిపోతూ,నోట్లో నుండి మాట కూడా సరిగా రాలేని పరిస్థితిలో విశాల్ చూసి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు విశాల్ కు ఏమైంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు విశాల్ తీవ్ర చలి జ్వరంతో భాదపడుతున్నాడని అంటుంటే, కాదని ఆ మధ్య ఓ సినిమా షూటింగ్ లో విశాల్ కు తీవ్ర గాయం కారణంగా కంటికి పై భాగంలో నరాలు కాస్త దెబ్బతిన్నాయని ఇటీవల ఆ గాయం మరల ఇబ్బంది పెట్టిందని అందువలనే వణుకుతున్నాడని  ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా తన సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న విశాల్ ను ఇలా చూడడం భాదాకరమైన విషయం. విశాల్ త్వరగా కోలుకుని తిరిగి సినిమాల్లో నటించాలని కోరుకుందాం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *