
తమిళ నటుడు విశాల్ (Vishal) ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా మాట్లాడకుండా ఉండేవారు. కానీ తాజాగా నడిగర్ సంఘం బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి కాబట్టి, తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
విశాల్ పెళ్లి విషయాన్ని ప్రకటించినది మరెవరో కాదు.. నటి సాయి ధన్సిక (Sai Dhanshika). ఆమె తన తాజా చిత్రం యోగి డా వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు. “నాకు 15 ఏళ్లుగా విశాల్‌తో మంచి పరిచయం ఉంది. ఎప్పుడూ గౌరవంగా పలకరించే వ్యక్తి. వ్యక్తిగత సమస్యలైతే ముందే నడిచే వాడివాడు” అంటూ గర్వంగా చెప్పారు. ఇప్పుడు వారి స్నేహం ప్రేమగా మారిందని, ఇద్దరికీ పెళ్లి కావాలని అనిపించడంతో ఆగస్టు 29న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశామని తెలిపారు.
విశాల్, ధన్సిక జంట పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాల్‌కు సిగ్గుతో మౌనంగా ఉండే విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పెళ్లి తర్వాత ధన్సిక నటన కొనసాగిస్తారా లేక విరమిస్తారా అన్నది తెలియాల్సిన విషయమే.
తెలుగు ప్రేక్షకులకు ధన్సిక పరిచయం 2022లో వచ్చిన షికారు సినిమాతో మొదలైంది. 2024లో ఆమె అంతిమ తీర్పు, దక్షిణ వంటి తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. పెళ్లి తర్వాత ఆమె కెరీర్ ఏ దిశలో సాగుతుందో చూడాలి!