
ఇండస్ట్రీలో చిన్ననాటి నటులుగా మొదలుపెట్టి, తర్వాత హీరోలుగా లేదా హీరోయిన్లుగా మారిన వారు చాలామందే ఉన్నారు. అటువంటి ట్రెండ్‌కి తాజా ఉదాహరణ విశికా కోటా. రామ్ చరణ్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ రచ్చలో విశికా చిన్ననాటి తమన్నా పాత్రలో నటించింది. అప్పట్లో బాగా క్యూట్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విశికా కోటా సగిలేటి కథ, ఏందిరా ఈ పంచాయితీ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు పోషించి టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఆమె నటనతో పాటు గ్లామర్ టచ్‌కి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రచ్చ సినిమా షూటింగ్ సమయంలో చరణ్, తమన్నాను కలవలేదు. మేము నటించిన సీన్స్‌కి వారు లేరు. ఇప్పుడు వాళ్లకు నేను గుర్తు ఉండేను కాబోలు,” అని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
1998 జూలై 19న హైదరాబాద్‌లో జన్మించిన విశికా, తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సినిమాల వైపు అడుగులు వేసింది. గ్లామర్‌తో పాటు మంచి నటనా నైపుణ్యం ఉన్న ఆమె, ప్రస్తుతం సూపర్ యాక్టివ్‌గా సోషల్ మీడియాలో ఉంటోంది. ప్రత్యేకించి Instagramలో తన హాట్ ఫోటోషూట్స్‌తో ట్రెండింగ్‌లో ఉంటుంది.
ప్రస్తుతం విశికా కోటా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ లో మెరిసింది. టాలెంట్‌తో పాటు గ్లామర్‌ని మిక్స్ చేస్తూ తెలుగుతెరపై తానేంటో చూపించేందుకు సిద్ధమవుతోంది. ఈ అందాల భామ నటించిన తాజా ఫోటోషూట్లు నెట్టింట వైరల్ అవుతుండటంతో, ఫ్యాన్స్ “ఈమె టాప్ హీరోయిన్ అవ్వడం కేవలం టైమ్ మేటర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.