మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే శ్రద్దా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మెకానిక్ రాకీ” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా టాక్ బాగున్నప్పటికీ బాక్సాఫీస్ పరంగా అనుకున్న రేంజ్ హిట్ అయితే కాలేదు.
దీనితో ఈ సినిమా వసూళ్ల పరంగా వీక్ పెర్ఫామెన్స్ నే అందుకుంది. మరి థియేటర్స్ రన్ తర్వాత ఇపుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.
మరో వీక్ గా ఉన్న ఫస్టాఫ్ పక్కన పెడితే సెకండాఫ్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. మరి ఈ సినిమా చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రై చేయొచ్చు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The post ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మెకానిక్ రాకీ” first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.