- విశ్వక్ సేన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కొత్త సినిమా
- ఫంకీ టైటిల్ ఖరారు చేసిన చిత్ర యూనిట్
- టాప్ టెక్నీషియన్లను తీసుకున్న డైరెక్టర్
Funky : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ లభించింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ వేళ, ఇప్పుడు విశ్వక్ నెక్స్ట్ మూవీకి సంబంధించి న్యూస్ వైరల్ అవుతుంది.
Read Also:Donald Trump: 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినవారికి వేగంగా అనుమతులు మంజూరు చేస్తా..
చాన్నాళ్ల కిందటే విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు. విశ్వక్ సేన్ ఇప్పటికే ‘లైలా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమ్మాయి గెటప్‌లో విశ్వక్ సందడి చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో సినిమా ఉంది.
Read Also:Crime News: రాజమహేంద్రవరం జైలులో ఖైదీకి చిత్రహింసలు!
హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌లో ఆదరగొట్టె హీరో విశ్వక్ సేన్, హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో అనుదీప్ కెవి దిట్ట, వీరి కొలాబరేషన్ యూనిక్ స్టొరీ లైన్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ కాంబో విశ్వక్ సేన్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని అనుదీప్ కెవి సిగ్నేచర్ హ్యూమర్‌తో బ్లెండ్ చేసి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘ఫంకీ’ అనే టైటిల్‌ని కూడా లాక్ చేశారని.. ఈ రోజే ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది.