
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన చివరిగా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఈసారి దర్శకుడు వశిష్ఠ అద్భుతమైన ఫాంటసీ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. ‘బింబిసార’ ద్వారా సూపర్ హిట్ అందుకున్న వశిష్ఠ, మెగాస్టార్ కోసం గ్రాండ్ విజువల్స్, స్టోరీతో ‘విశ్వంభర’ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి.
ఈ చిత్రంలో త్రిషా ప్రధాన కథానాయికగా నటించగా, ఆషికా రంగనాథ్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. అయితే, ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్ రీ-ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె మరెవరో కాదు, ‘ప్రేమ కావాలి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఇషా చావ్లా. ఆదిసాయికుమార్ సరసన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఇషా చావ్లా, ఇప్పుడు మెగాస్టార్ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘విశ్వంభర’లో ఆమె పాత్ర ఎంత కీలకమో తెలియాలంటే, మరికొన్ని రోజులు వేచి చూడాలి. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్‌తో వస్తున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్, అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచింది.
ఈ సినిమా భారీ బడ్జెట్‌తో టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాల్లో తెరకెక్కుతోంది. వీఎఫ్ఎక్స్ (VFX) కీలకంగా ఉండే ఈ ప్రాజెక్ట్, చిరంజీవికి మరో విజయం తీసుకురావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.