Puranapanda Srinivas

హైదరాబాద్ : నవంబర్ : 18

అరమరికలొద్దు. అపోహలొద్దు. అనుమానాలొద్దు. అసూయలొద్దు . అహంకారాలొద్దు . బ్రాహ్మణుడు క్షేమంకరమైన భావాలతో సంచరిస్తేనే అపూర్వాలు సమాజానికి అందుతాయంటూ చాలా చక్కగా …. ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు, ఇటీవల హైదరాబాద్ లో ఆరామ ద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో … రాష్ట్ర నూతన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నిర్మాత వివేక్ కూచిభొట్ల సమర్ధ పర్యవేక్షణలో సుమారు ఎనిమిది గంటలపాటు కూకట్ పల్లి లో జరిగిన కార్తీక సమారాధన సందర్భంలో వందలమంది కలయిక సందర్భంగా జరిగిన వేడుకలో పురాణపండ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

సుమారు పది సంవత్సరాలుగా జంటనగరాలు ప్రధాన కేంద్రంగా దిన దిన ప్రవర్ధమానమై ఇప్పుడు సుమారు వెయ్యికి పైగా సభ్యత్వం కలిగి అసాధారణంగా మంచి కార్యక్రమాలతో దూసుకుపోతున్న ని సుమారు ముప్పైమంది కమిటీ సభ్యులు ఎంతో ఐకమత్యంగా నడపడంవల్లనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాల్లో ఆరామ ద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఒక ప్రధాన భూమికను సంతరించుకుంది. ఏ మహోదాత్త సంకల్పంతో ప్రముఖ పాత్రికేయులు వేదుల సూర్యనారాయణమూర్తి ఈ సంఘాన్ని స్థాపించారో కానీ ఇప్పుడు నిర్మాత వివేక్ కూచిభోట్లకు అధ్యక్ష పగ్గాలు అప్పగించడంతో కమిటీలో నూతనోత్సాహం ఉత్తేజంతో సంతరించుకుంది .

ఇటీవల నిర్వహించిన కార్తీక సమారాధనలో సంస్థ పాలకవర్గమైన వేదుల సుదర్శనరావు, వేదుల లక్ష్మీనారాయణ, ఏ.వి.ఎస్. ఎన్ . మూర్తి , కొల్లూరు సూర్యారావు, ఆకుండి సూర్య, చెళ్ళపిళ్ళ సుబ్రహ్మణ్యం, అల్లంరాజు శ్రీకాంత్, తాతపూడి సత్యభద్రకీర్తి , పొదిలి సతీష్ , మహేంద్రవాడ మూర్తి, చెళ్ళపిళ్ళ లక్ష్మీ గణనాథ్ , సోషల్ మీడియా డిజిటల్ క్రియేటర్ ఆకొండి సూర్య తదితర మిత్ర బృందం చేసిన కృషి, శ్రమ కొట్టొచ్చినట్లు కనిపించి అందరి అభినందనలు అందుకోవడం విశేషం. మరీముఖ్యంగా పూర్వ డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్ కె .అరవిందరావు ప్రధాన అతిధిగా పాల్గొనడం, అందరితో కలుపుగోలుగా వ్యవహరించడం , సంప్రదాయ సంస్కృతీపరమైన సందేశమివ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంలో ఈ సంస్థ రూపొందించిన ‘ బ్రహ్మ తేజస్సు ‘ అనే డైరీ ప్రత్యేక సంచికను అరవిందరావు ఆవిష్కరించారు.

మరొక విశేషంగా వివిధరంగాల ప్రముఖులైన భళ్ళముడి శ్రీరామశంకరప్రసాద్ , ఓలేటి శ్రీనివాస భాను,ఆకొండి శ్రీనివాస రాజారావు, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, భళ్ళమూడి శ్రీరామ శంకర ప్రసాద్ లను వందల బ్రాహ్మణ ప్రేక్షకుల చప్పట్లమధ్య ఘనంగా సత్కరించారు, విఖ్యాత సినీ నేపధ్య గాయని శ్రీమతి మాళవిక సకుటుంబంతో హాజరై అందరితో ఆత్మీయంగా గడపడం ఒక ప్రత్యేకతైతే , మాళవిక పాడిన పాటలుఅదరహో గా హైలైట్ గా నిలిచాయి. కార్యక్రమాన్ని ఎలా నడిపించాలో ముందే నిర్దిష్ట కార్యాచరణ రూపొందించడంలో వివేక్ కూచిభొట్ల ఆదరసవంతమైన పాత్ర పోషించి శభాష్ అనిపించుకున్నారు, పాలకవర్గ సభ్యుల ఐకమత్యమే ఈ విజయమని చెప్పక తప్పదు .

ఎన్నో వేదికలపై అద్భుత ప్రసంగాలిచ్చే పురాణపండ శ్రీనివాస్ సర్వసాధారణంగా కుల సంఘాల సమావేశాలకు, వేడుకలకు రారని ప్రచారం వుంది. అయితే వివాదాలకు అతీతథంగా సాత్విక స్వభావులైన వివేకా కూచిభొట్ల మంచితనం , మిగిలిన కార్యవర్గం ప్రేమ తననిక్కడికి రప్పించాయని బాహాటంగా చెప్పారు . శ్రీనివాస్ మాట్లాడుతాన్నంతా సేపూ ప్రేక్షకుల ఆసక్తిగా చప్పట్లు మధ్య మధ్య కొడుతూ ఉత్సాహ పరచడం ఆసక్తిదాయకంగా కనిపించింది.

సంస్థ గౌరవ సలహాదారురాలైన శ్రీమతి కూచిభొట్ల సూర్యకాంతి చక్కగా అందరినీ పలకరిస్తూ … ఉత్సాహవంతంగా భూమిక పోషించి ప్రశంసలు అందుకోగా …. కార్యక్రమం ఆద్యంతం యాంకర్ డి.ఉష అందమైన శబ్ద పదజాలంతో, చక్కని వాచికంతో నడిపించినతీరు ఆమెను మరొక మెట్టు ఎక్కించాయి. . బ్రాహ్మణ సంఘాలలో ఈ ఆరామ ద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ చక్కని నిర్వహణ మిగిలిన బ్రాహ్మణ సంఘాలు కొన్నింటిలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది . వివేక్ కూచిభొట్ల లా రాజకీయాలకు, వ్యక్తి స్వార్ధాలకు దూరంగా కమిటీ లో అందరినీ కలుపుకుంటే అన్ని సంఘాలకు విజయం తధ్యమంటున్నారు విజ్ఞులు. పాలకవర్గంలో ప్రతీ ఒక్కరూ చేసిన కృషి మరువలేనిది, విందులు, వినోదాలతో , ఆనందంగా అందరూ అందమైన జ్ఞాపకాలతో ఈ కార్యక్రమానికి ముగింపుపలకడం కొసమెరుపు .

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *