Vrushabha: మోహన్ లాల్ వృషభ ఇక లేనట్టే!

తాజాగా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడిన హీరో శ్రీకాంత్ మోహన్ లాల్ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే మోహన్ లాల్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరో కీలక పాత్రలో వృషభ అనే సినిమా ప్రారంభమైంది. గత ఏడాది జూలైలో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్. రాగిణి ద్వివేది, జర, షనాయా కపూర్ వంటి ఇతర కీలక నటులు కూడా నటించారు. తెలుగు సహా మలయాళ భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లుగా శ్రీకాంత్ వెల్లడించారు. నిర్మాతతో వచ్చిన డిఫరెన్సెస్ కారణంగా సినిమా ఆగిపోయినట్లు ఆయన వెల్లడించారు.

Srikanth: గేమ్ ఛేంజర్ కోసం శ్రీకాంత్ తండ్రి.. అలా ఇంటికి వెళ్తే బిత్తరపోయారు!

మొదటి షెడ్యూల్ తోనే సినిమాకి ప్యాకప్ చెప్పేసారని ఆ సినిమా అయితే ప్రస్తుతానికి చేయడం లేదని అన్నారు. ఇక ప్రస్తుతానికి రోషన్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఛాంపియన్ అనే సినిమా చేస్తున్నాడని ఆయన వెల్లడించారు. ఇక ఆగిపోయిన వృషభ సినిమా తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కించాలని అనుకున్నారు. నందకిషోర్ దర్శకత్వంలో మోహన్ లాల్ – రోషన్ ఇద్దరు తండ్రీకొడుకులుగా ఈ సినిమాని ప్రారంభించారు. అయితే నిర్మాత కారణంగా సినిమా ఆగిపోయినట్లుగా తాజాగా తెలుస్తోంది. ఈ సినిమాని మొదట తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు అందులో భాగంగానే సినిమాని ద్విభాషా చిత్రంగానే ప్రమోట్ చేశారు. తర్వాత సినిమాని తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక ఈ సినిమా షెల్వ్ కావడంతో ఆ ఆశలన్నీ నిరాశైనట్టే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *