
బాలీవుడ్ ప్రేమికులకు వృషిక మెహతా పేరు కొత్తకాదు. చిన్న వయసులోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, 29 ఏళ్లకే కోట్లాది విలువైన ఆస్తులను సంపాదించింది. అయితే ఇప్పుడు ఆమె యాక్టింగ్ మానేసి ప్లాస్టిక్ సర్జన్ కావాలని నిర్ణయించుకుంది.
వృషిక మెహతా – వ్యక్తిగత జీవితం
వృషిక 1994 ఫిబ్రవరి 18న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించింది. గుజరాతీ కుటుంబంలో పుట్టినా, తల్లిదండ్రులు ఆమె కలలకు ఎప్పుడూ అడ్డుగా నిలవలేదు. చిన్నతనం నుండే ఆమెకు నటనపై ఆసక్తి ఉండేది.
సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
కాలేజీ రోజుల్లో వృషిక “దిల్ దోస్తీ డాన్స్” అనే టీవీ షో కోసం ఆడిషన్ ఇచ్చింది. ఇదే ఆమె సినీ ప్రయాణానికి తెరతీసింది. ఈ షోలో షారన్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత “యే తేరీ గలియన్”, “సత్రంగి ససురల్”, “సత్య ఆయి తమన్నా” వంటి అనేక హిట్ సీరియల్స్ లో నటించింది. ముఖ్యంగా “యే తేరీ గలియన్” లో పాఖి పాత్ర ఆమె కెరీర్‌లో మైలురాయి.
నూతన జీవితం – ప్లాస్టిక్ సర్జన్ మార్పు
2023లో తన చిరకాల ప్రియుడు సౌరభ్ ఘేడియాను వివాహం చేసుకున్న వృషిక, ఇప్పుడు కెనడాలో స్థిరపడింది. నటన మానేసిన తర్వాత, ఆమె వ్లాగింగ్ చేయడం ప్రారంభించింది. తన తాజా వ్లాగ్‌లో, ఆమె ప్లాస్టిక్ సర్జన్ అవ్వాలనే తన కొత్త లక్ష్యం గురించి వెల్లడించింది.