Game Changer: పూర్ గూజ్ బంప్స్.. గేమ్ చేంజర్ ట్రైలర్ అదిరింది బాసూ!

  • జనవరి 10న థియోటర్లలో గేమ్ చేంజర్
  • ప్రమోషన్స్ లో బిజీగా మేకర్స్
  • సినిమా కథను వెల్లడించిన నటుడు ఎస్ జే సూర్య

రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 2025 ఆరంభంలోనే బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేయడానికి దూసుకొస్తోంది. మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్. ముందుగా లక్నోలో గ్రాండ్‌గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇటీవల హైదరబాద్‌లో దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు. రాజమహేంద్రవరంలో నిన్న రాత్రి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇదిలా ఉండగా.. సినిమా ప్రమోషన్‌లో భాగంగా నటుడు ఎస్ జే సూర్య సినిమా కథ గురించి వెల్లడించాడు.

READ MORE: MK Stalin: “సింధూ నాగరికత”ను డీకోడ్ చేసిన వారికి రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీ.. స్టాలిన్ ప్రకటన..

“ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ శంకర్ క్రియేట్ చేసిన ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. ఇవన్నీ కాకుండా.. రీసెంట్‌గానే నేను జరగండి పాటను చూశాను. లిరికల్ వీడియో వచ్చినప్పుడు నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ పూర్తి పాటను చూసి షాక్ అయ్యాను. ఈ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపిస్తుంది. ” అని నటుడు ఎస్ జే సూర్య తెలిపాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *