Published on Dec 1, 2024 11:30 PM IST
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఐకానిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేసిన భారీ హిట్ చిత్రం “భారతీయుడు” కోసం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన “భారతీయుడు 2” మాత్రం భారీగా ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఫస్ట్ పార్ట్ మీద ఉన్న గౌరవంతో పార్ట్ 2 పై కూడా డీసెంట్ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది.
అయితే శంకర్ ఏకంగా పార్ట్ 2 చేస్తున్న సమయంలోనే పార్ట్ 3 కూడా కంప్లీట్ చేసేసారు. తీరా సీన్ కట్ చేస్తే పార్ట్ 2 ఆడనే లేదు. కానీ పార్ట్ 2 ప్రమోషన్స్ లో ఆరు నెలల గ్యాప్ లో అయితే పార్ట్ 3 ని రిలీజ్ చేస్తామని చెప్పారు. అలా 2025 జనవరికి పార్ట్ 3 ని లాక్ చేయగా ఇపుడు జనవరి దగ్గరకి రానే వస్తుంది కానీ భారతీయుడు 3 నుంచి సింగిల్ అప్డేట్ కూడా ఇంకా లేదు.
సో వీటితో పార్ట్ 3 ఉన్నట్టా లేనట్టా అనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే ఆ మధ్య పార్ట్ 3 డైరెక్ట్ గా ఓటిటిలోనే ఇచ్చేస్తారు అని పలు రూమర్స్ కూడా వినిపించాయి. కనీసం దీనిపై కూడా ఎలాంటి న్యూస్ లేదు. మరి ఎక్కడా రిలీజ్ కాకుండా పార్ట్ 3 మిగిలిపోతుందా లేక వస్తుందా అనేది చూడాలి మరి.