
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అందాల భామలు వచ్చి వెళ్లిపోయాయి. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్‌లు ఒక్కటి రెండు హిట్స్‌తోనే కెరీర్‌ను ముగించుకోవాల్సి వస్తోంది. అలాంటి వారిలో ఒకరు ప్రణీత సుభాష్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో 8 సినిమాలు చేసినా, ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ఒక్కటే – పవన్ కళ్యాణ్‌తో నటించిన అత్తారింటికి దారేది.
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రణీత, ఆ తర్వాత బావ, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అయినా కూడా ఆమె క్యూట్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ప్రణీత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవుతూ, అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. గ్లామర్ విషయంలో మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదని నెటిజన్లు అంటున్నారు.
ప్రస్తుతం నెటిజన్లు “ప్రణీత ఇప్పుడు ఎక్కడ..?”, “ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందా?” అనే ప్రశ్నలతో గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే అభిమానుల ఆనందానికి మింపు ఉండదు.