Published on Dec 22, 2024 11:32 AM IST
‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్స్ సమయంలో జరిగిన విషాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేయడం, ఆ ఆరోపణల పై అల్లు అర్జున్ మీడియా ద్వారా వివరణ ఇవ్వడం తెలిసిందే. అయితే, ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతిని ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఈ నిర్ణయం ప్రభావం వచ్చే నెలలో విడుదల కానున్న పెద్ద సినిమాలపై భారీగా పడనుంది. సంక్రాంతి స్పెషల్ గా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రాబోతుంది.
‘గేమ్ ఛేంజర్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే, ఈ సినిమా రేంజ్ కి తగ్గట్టు భారీగా కలెక్షన్స్ రావాల్సి ఉంది. బెనిఫిట్ షోలకు, అధిక టికెట్ రేట్లకు అవకాశం లేకపోతే.. ? ఏమిటి పరిస్థితి. మరోవైపు బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాతో పాటు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలు కూడా సంక్రాంతి స్పెషల్ గా రాబోతున్నాయి. ‘డాకు మహారాజ్’కి కూడా బెనిఫిట్ షోలు, అధిక టికెట్ రేట్లు లేకపోతే.. సినిమా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఏది ఏమైనా బెనిఫిట్ షోల రద్దు నిర్ణయంతో పెద్ద బడ్జెట్ సినిమాలకు నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది.