What’s Next for Yash After Toxic & Ramayana?
What’s Next for Yash After Toxic & Ramayana?

సాధారణ బస్ డ్రైవర్ కుమారుడిగా పుట్టిన యష్, కేవలం కన్నడ హీరో మాత్రమే కాదు, పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కెరీర్ ప్రారంభంలో బుల్లితెర సీరియల్స్ లో నటించిన యష్, ఆపై కన్నడ సినిమాల్లో హీరోగా ఎదిగాడు. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన “కేజీఎఫ్” చిత్రం అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన “కేజీఎఫ్ 2” సినిమాతో దేశవ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం “టాక్సిక్” అనే సినిమాతో బిజీగా ఉన్న యష్, షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఇక “రామాయణం” ప్రాజెక్ట్‌లో కూడా యష్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. బాలీవుడ్ లో ఎక్కువ అంచనాలు ఉన్న ఈ మైథలాజికల్ మూవీ లో యష్ రావణుడి పాత్ర పోషించనున్నాడు. ఇది నెగెటివ్ రోల్ అయినప్పటికీ, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మొదట ఈ విషయం గోప్యంగా ఉంచినప్పటికీ, యష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఇది నిజమేనని ధృవీకరించాడు. ఇటీవలే ఈ సినిమాకు షూటింగ్‌లో కూడా చేరాడు.

ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ తరువాత, యష్ మరో భారీ సినిమా లైన్ అప్ చేసుకున్నాడని టాక్. ప్రముఖ తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో యష్ కొత్త సినిమాలో నటించనున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మిత్రన్ “సర్దార్ 2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యష్‌తో కలిసి ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది.

యష్ ప్రస్తుతం పాన్-ఇండియా రేంజ్‌లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ, తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రతీ సినిమాతో హైప్ క్రియేట్ చేస్తూ, సినీ ప్రపంచాన్ని ఏలుతున్న యష్, ఈ కొత్త ప్రాజెక్ట్స్‌తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *