- వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న తెలుగు సినీ పరిశ్రమ..
- టాలీవుడ్ ఇండస్ట్రీకి దిష్టి తగిలిందని అభిమానులు కామెంట్స్..
- ఇప్పటికే చిక్కుల్లో పడిన అక్కినేని, మంచు, అల్లు కుటుంబాలు..
Controversies Rock Tollywood: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలకు దిష్టి తగిలినట్లుంది. ఎందుకంటే, కొద్ది రోజులుగా వరుసగా టాలీవుడ్ కు చెందిన స్టార్ నటుల కుటుంబాలు వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నట్లు వంటి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కూడా వివాదాల్లో నిలిచింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో పాటు నాగచైతన్య- సమంత విడాకుల గురించి మంత్రి చేసిన కామెంట్స్ తో ఈ కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది. అలా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి తెలుగు సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో సపోర్టుగా నిలిచింది.
Read Also: Allu Arjun@7697: అల్లు అర్జున్కు ఖైదీ నెంబర్ 7697..
అయితే, గత వారంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు నెలకొన్నాయి. అయితే, అవి పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలైనప్పటికీ ఈ కుటుంబంలో జరిగిన గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు ఉంటే మంచు మనోజ్ మాత్రం ఒంటరిగా నిలబడటంతో వీరి మధ్య గొడవలకు దారి తీసింది. ఇలా మంచు కుటుంబంలో వివాదం ముగిసిపోయింది అనేకునే లోపు అల్లు ఫ్యామిలీలో వివాదం వెలుగులోకి వచ్చింది.
Read Also: Allu Arjun Press Meet: అరెస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?
ఇక, పుష్ప-2 సినిమా రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. దీంతో ఆ వివాదం అల్లు అర్జున్ కు చుట్టుకొని ఏకంగా ఆయనని జైలుకు వెళ్లేలా చేసింది. పాన్ ఇండియా స్టార్ హీరోగా జాతీయ అవార్డు అందుకున్నటువంటి ఒక నటుడిని తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోతే.. అరెస్టు చేయడంతో వ్యతిరేకత వస్తోంది. అయితే, వీరితో పాటు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం వివాదాల్లో చిక్కుకున్నారు. కాగా, చిన్న చిన్న విషయాలకే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు దిష్టి తగిలిందని అనుమానం కలుగుతుంది. అందుకే సెలబ్రిటీలు వరుసగా ఇలా వివాదాలలో చిక్కుకుంటున్నారని నెట్టింట టాలీవుడ్ హీరోల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.