ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ అంతా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం డెఫినెట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ చిత్రం “పుష్ప 2” అనే చెప్పాలి. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా దేశ వ్యాప్తంగా సాలిడ్ ప్రమోషన్స్ ని చేస్తుండగా నార్త్ ఇండియాలో కూడా సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తున్నట్టుగా టాక్ ఉంది.
అయితే అల్లు అర్జున్ కి నార్త్ ఆడియెన్స్ లో ఎప్పుడు నుంచో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీనితోనే సినిమా ట్రైలర్ ని ఊహించని లెవెల్లో పాట్నాలో విడుదల చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్టుగా అక్కడ అల్లు అర్జున్ కోసం జనం వచ్చారు. మరి అక్కడ అలాంటి క్రేజ్ చూసిన ఈ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయి మరి అంటే?? పాట్నాలో డే 1 కి పుష్ప 2 మాగ్జిమమ్ మంచి బుకింగ్స్ ని నమోదు చేసినట్టుగా కనిపిస్తుంది.
ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ అండ్ పలు ఐనాక్స్ చైన్స్ లో అయితే పుష్ప 2 మాస్ చూపిస్తుంది. దాదాపు అన్ని టికెట్స్ కూడా అక్కడ పుష్ప 2 కి అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. దీనితో ట్రైలర్ ని ప్రత్యేకంగా అక్కడ రిలీజ్ చేసిన ప్రాంతంలో పుష్ప 2 బుకింగ్స్ కూడా సాలిడ్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు.
The post పాట్నాలో “పుష్ప 2” బుకింగ్స్ పరిస్థితి.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.