When is NTR’s Dragon Releasing?
When is NTR’s Dragon Releasing?

ఎన్టీఆర్ – నీల్ ప్రాజెక్ట్ పేరుగా “డ్రాగన్” అనుకోవచ్చని ఫ్యాన్స్ ఆనందంగా చర్చించుకుంటున్నారు. దీనికి కారణం, తాజాగా తమిళంలో “డ్రాగన్” అనే మూవీ విడుదల కావడమే. తెలుగు వెర్షన్‌కు “Return of the Dragon” అనే పేరు పెట్టిన నేపథ్యంలో, ఎన్టీఆర్ – నీల్ సినిమాకు కూడా “డ్రాగన్” అనే పేరు ఖరారైనట్లేనని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. మొదటి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనకుండా ప్లాన్ చేయగా, రెండో షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2026 కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు నీల్ ఇప్పటికే, ఈ సినిమా ఊహించని స్థాయిలో ఉంటుందని హింట్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎన్టీఆర్ “War 2” షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో “Naatu Naatu” తరహాలో ఓ మాస్ సాంగ్ చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక, నీల్ సినిమాకు ఎన్టీఆర్ జాయిన్ అవుతారని సమాచారం.

ఈ సినిమా పేరుపై అధికారిక అనౌన్స్‌మెంట్ రాకపోయినా, “డ్రాగన్” అనే టైటిల్‌కు బలమైన హింట్స్ వస్తుండటంతో, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *