రాజమౌళి చెప్పినట్టే సుకుమార్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2తో ప్రూవ్ అయింది. అంతేకాదు ఏకంగా రాజమౌళి రికార్డ్‌ను బ్రేక్ చేసేశాడు సుకుమార్. 2017లో రూ. 1800 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 ఆ రికార్డ్‌ను దాదాపు 8 ఏళ్లు హోల్డ్ చేయగలిగింది. పైనల్‌గా ఇప్పుడు ఆ రికార్డ్‌ను పుష్ప2 బ్రేక్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ వసూలు రాబట్టిన సినిమాగా టాప్ 2లో నిలిచింది. టాప్ ప్లేస్‌లో అమీర్ ఖాన్ దంగల్ చైనాలో ఈ సినిమా సునామీ సృష్టించింది. ఆ కలెక్షన్స్ కలుపుకొని 2 వేల కోట్లతో టాప్ ప్లేస్‌లో కుర్చుంది దంగల్.
కాబట్టి మన లెక్క ప్రకారం అయితే బాహుబలి- 2నే నెంబర్ వన్. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి పుష్ప- 2 వచ్చి నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. అయితే రూ. 1800 కోట్ల రికార్డ్‌ను పుష్ప2 రెండు మూడేళ్లే హోల్ట్ చేసేలా ఉంది. ఎందుకంటే.. నెక్స్ట్ లైనప్‌లో ఉన్న పాన్ ఇండియా సినిమాలు రెండు వేల టార్గెట్‌గా రాబోతున్నాయి. నెక్స్ట్ ఈ లిస్ట్‌లో ప్రభాస్, రాజమౌళి, ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2, స్పిరిట్, సలార్ 2 సినిమాలపై భారీ హైప్ ఉండగా రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న సినిమా 3 వేల కోట్లు టార్గెట్‌గా రాబోతోంది. అలాగే ఎన్టీఆర్, [ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా అవకాశం లేకపోలేదు. కాకుంటే ఈ సినిమాలు రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది కాబట్టి నెక్స్ట్ రెండు మూడేళ్లలో పుష్ప2 రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. రాజమౌళి మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ నీల్ మాత్రం ఇప్పటి వరకున్న రికార్డులన్నీ చెరిపేయడం గ్యారెంటీ. మరి పుష్ప 2ని ఎవరు ముందు బీట్ చేస్తారో చూడాలి.