- టాలీవుడ్‌కు అను ఇమాన్యుయేల్ టాటా చెప్పిందా..?
- రావణాసుర తర్వాత గప్ చుపైన బ్యూటీ
- ఈ ఏడాది ఏ ఇండస్ట్రీని పలకరించని భామ
- అవకాశాలు రావట్లేదా..? గ్యాప్ తీసుకుంటుందా..?
కేరళ కుట్టీ అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ..? మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే.. ఆమె ఎందుకు వెనకడుగు వేస్తోంది..? అవకాశాలు రావట్లేదా..? కావాలనే గ్యాప్ తీసుకుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బ్యూటీఫుల్ ఫేస్.. అంతకు మించి యాక్టింగ్ స్కిల్, ఉంటే.. ఏం లాభం.. ఆవగింజంత లక్ లేకపోతే. ఇది కేరళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ విషయంలో ట్రూ అనిపిస్తుంది. ఒకటా రెండా.. ఇంచు మించు 10 సినిమాలు చేస్తే.. ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టే లేకపోవడం. అదీ కూడా సాదా సీదా హీరోలు కాదు.. టైర్ 1 స్టార్లతో జతకట్టిన ఎక్స్ పీరియన్స్ ఆమెది. కానీ అవకాశాలు మాత్రం రావట్లేదు.
Pushpa-2 Controversy: పుష్ప- 2కి షెకావత్ కష్టాలు.. దాడులు చేస్తామంటూ కర్ణిసేన వార్నింగ్
నాని మజ్నుతో స్టార్టైన ఆమె కెరీర్.. లాస్ట్ ఇయర్ రావణాసుర వరకు కొనసాగింది. తమిళంలో వచ్చిన జపాన్ కూడా ఆమె కెరీర్‌కు రిమార్క్‌గా మారిపోయింది. దీంతో ఈ ఏడాది ఏ ఇండస్ట్రీని పలకరించలేదు అమ్మడు. ప్రజెంట్ ఆమె చేతిలో మలయాళ మూవీ యాక్షన్ హీరో బిజు2 మాత్రమే ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో కొత్త సినిమాలు ఒప్పుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి టాటా చెప్పిందానన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. నిజంగానే టీటౌన్‌లో లక్ ఫ్యాకర్ట్ ఆమె కెరీర్‌ను డిసైడ్ చేసిందా..? ఇక ఇక్కడ సినిమాలు చేయదా..? లేదా కావాలనే గ్యాప్ తీసుకుందా..? చూద్దాం.. నెక్ట్స్ ఇయర్ ఏదైనా అప్టేడ్ ఇస్తుందేమో