Why Nana Patekar Chose Village Life Over Mumbai’s Luxury
Why Nana Patekar Chose Village Life Over Mumbai’s Luxury

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఊపేసిన సీనియర్ నటుడు నానా పటేకర్, ఇప్పుడు మాత్రం నగర జీవితం వదిలి పల్లెటూరిలో సాదాసీదా జీవనం గడుపుతున్నారు. దశాబ్దాల సినీ ప్రస్థానంలో హీరోగా, విలన్‌గా, కమెడీ ఆర్టిస్టుగా ఇలా అన్ని విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన నానా, ఇప్పుడు మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో నివసిస్తున్నారు.

తనకు ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ, సినిమాల షూటింగ్ కోసమే అక్కడికి వెళ్లతానని అంటారు నానా పటేకర్. ఇటీవల అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఒక టీవీ షోలో మాట్లాడిన నానా, తన గ్రామ జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఇక్కడ నాకు పది ఆవులు, ఎద్దులు, ఆరు కుక్కలు ఉన్నాయి. ప్రకృతి అందాలు, నిశ్శబ్దం, స్వేచ్ఛ అన్నీ ఇక్కడే ఉన్నాయి” అని చెప్పారు.

“కొత్త బంగ్లా కొనాలని లేదు, కొత్త కారు అవసరం లేదు. గొట్టపు బావి తవ్వించాను. అది చూసిన ఆనందం, కొత్త కారు కొంటే కూడా రాదు” అని తెలిపారు. గ్రామంలోని మనుషులెందరో, జంతువులెందరో తనకు కుటుంబసభ్యుల్లా అనిపిస్తారని చెప్పారు.

ఇది కాకుండా, కెరీర్ పీక్స్‌లో ఉండగానే సినిమాలు వదిలి కార్గిల్ యుద్ధానికి వాలంటీర్‌గా వెళ్లిన సంగతి మర్చిపోలేం. దేశభక్తితో పాటు నిజాయితీగా జీవించడంలో నానా పటేకర్‌కు సాటి వారు లేరు అని ఇండస్ట్రీలో చెబుతారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *