పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు మూడు సైన్ చేసిన సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.
కానీ ఈ సినిమా షూటింగ్ వాయిదా కారణంగా దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే రీమేక్ సినిమా చేసాడు. ఈ సినిమా దారుణ పరాజయం పాలైంది. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ్ లో వచ్చిన తేరి సినిమాకు అఫీషియల్ రీమేక్. ఇటీవల వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ నిర్మాణంలో కలీస్ దర్శకత్వంలో ‘బేబీ జాన్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విజయ్ ‘తేరి’కి రీమేక్‌గా వచ్చింది. అయితే క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు డిజాస్టర్ దిశగా వెళుతోంది. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సందేహాలు మొదలయ్యాయి. స్ట్రయిట్ సినిమాలతో హిట్ లేని హరీష్ శంకర్ కు రీమేక్స్ బాగా చేస్తాడని పేరుంది. గబ్బర్ సింగ్, గడ్డలకొండ గణేష్ సినిమాలు అందుకు ఉదారహరణ. కానీ హరీష్ శంకర్ ఫామ్ లో లేకపోవడం, బేబీ జాన్ ప్లాప్ కావడం, అలాగే పవర్ స్టార్ ఇతర సినిమాల కమిట్మెంట్స్ కారణంగా అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే చర్చ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి తీరుతానని దర్శకుడు హరీష్ గతంలో ప్రకటించిన సంగతి విదితమే.