“పుష్ప 2” దెబ్బ.. 1000 కోట్ల మార్క్ కోసం స్ట్రగుల్ అవుతున్న ప్రముఖ ఇండస్ట్రీ.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 6, 2024 11:06 AM IST

ఇపుడు ఇండియన్ సినిమా నుంచి 1000 కోట్ల మార్కెట్ అండ్ బాక్సాఫీస్ సినిమాలు అనేవి తరచుగా వినిపిస్తూ ఓ భారీ సినిమా వస్తే గ్యారెంటీ అనే లెవెల్లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఇలా బాహుబలి 2 నుంచి మన సౌత్ సినిమాలు 1000 కోట్ల మార్కెట్ కి గేట్లు తెరుచుకోగా ఇపుడు మన సౌత్ సినిమా సహా హిందీ సినిమాలో కూడా సరైన సినిమా పడితే 1000 కోట్ల గ్రాస్ మార్క్ అనేది ఈజీగా కొట్టేసే పరిస్థితిలు కనిపిస్తున్నాయి.

అయితే ఇపుడు ఇండియన్ సినిమా సహా ఓవర్సీస్ మార్కెట్ లో సత్తా చాటి 1000 కోట్లు మార్క్ అందుకున్న ఇండస్ట్రీలో మన తెలుగు నుంచే అత్యధిక సినిమాలు ఉంటే నెక్స్ట్ హిందీ, తదుపరి కన్నడ సినిమాలు ఉన్నాయి. కానీ ఇంకా మా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు 1000 కోట్ల మార్క్ ని కొడతాయి అని ఎదురు చూస్తుంది మాత్రం కోలీవుడ్ ఆడియెన్స్ అని చెప్పాలి.

చాలా ఏళ్ల నుంచి తమిళ్ సినిమాకి 1000 కోట్ల క్లబ్ సినిమా అనేది ఇంకా అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. అన్నీ సెట్ అయితే ఎప్పుడో 2.0 సినిమాలో శంకర్ అండ్ రజినీకాంత్ లు సెట్ చేయాల్సింది ఉంది. కానీ అది సరైన టాక్ లేక సాధ్యపడలేదు దీనితో తమిళ సినిమా హైయెస్ట్ గా 800 కోట్ల మార్క్ దగ్గరే ఆగిపోయింది.

ఇపుడు ఇతర సినిమాలు మెయిన్ గా లేటెస్ట్ పుష్ప 2 దెబ్బ చూసి అయితే మరో సినిమా తెలుగు నుంచి 1000 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది మన సినిమా ఎప్పుడు అంటూ తమిళ ఆడియెన్స్ బాధ పడుతున్నారు. మరి ఈ మార్క్ ని కొట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా దాదాపు లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ సినిమా ‘కూలీ’ నిలవొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ 1000 కోట్ల మార్క్ ఎప్పటికి టచ్ చేస్తారో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *