మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ షోలో సందడి చేసారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ కూడా మంగళవారం ఫినిష్ చేసారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ తో పాటు యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. సరదా సన్నివేశాలతో, ఆటలతో ఈ ఎపిసోడ్ చాలా హుషారుగా సాగిందని ఆహా యూనిట్ వర్గాల టాక్.
అయితే ఈ ఎపిసోడ్ లో అన్నిటికంటే ఎక్కువగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసుకున్న హుడీ గురించి నెట్టింట చర్చ మొదలైంది. తమ హీరోగాలు ఏదైనా ఖరీదైన వస్తువులు ధరిస్తే వాటి ధరను గూగుల్ లో వెతికి మరి పట్టుకుని మా వోడు వేసుకున్నది అత్యంత కాస్ట్లీ అని సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం చూస్తూనే ఉంటాం. తాజాగా రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ షోలో వేసుకున్న హుడీ ధరను కనిపెట్టేసారు నెటిజన్స్. ఈ హుడి ధర అక్షరాలా లక్ష ముప్పై ఐదువేల రూపాయాలట. ఆఫర్ లో రూ. 88 వేలుగా ఉంది. ఇక రామ్ చరణ్ షర్ట్ కాస్ట్ తెలిసి అంత కాస్ట్లీ ఆ అని నెటిజన్లు నోరెళ్ళబెడుతున్నారు. గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10 న రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.