అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ రితికా నాయక్. హాయ్ నాన్న సినిమాలో ఓ కీ రోల్ చేసి టాలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకుంది. ఈ క్రేజ్ తోనే ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటోంది. హీరోయిన్ గా తన స్పీడ్ పెంచుతోంది. ఆనంద్ దేవరకొండ సరసన రితికా నటిస్తున్న డ్యూయెట్ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈలోగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ దక్కించుకుందీ యంగ్ హీరోయిన్.

తేజ సజ్జ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ రితికాను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ ఘట్టమనేని రీసెంట్ గా రవితేజ హీరోగా ఈగిల్ సినిమాను తెరకెక్కించాడు. తేజ సజ్జ ఈ సంక్రాంతికి హనుమాన్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వీరి కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి క్రేజీ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఈ సినిమా రితికా నాయక్ కు దక్కడం ఆమె కెరీర్ కు బిగ్ ఫ్లస్ పాయింట్ అనుకోవచ్చు.