- అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన వైఎస్ జగన్
- ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం?
- అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను: వైఎస్ జగన్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో చెంచల్ గూడా జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో వాదోపవాదాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు.
Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు14 రోజుల రిమాండ్
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటూ జగన్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024