Zee : న్యూ ఇయర్ కానుకగా జీ తెలుగు డబుల్ బొనాంజా..

అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి10 గంటలకుప్రసారం చేయనుంది. ఆసక్తికరమైనమలుపులు, అదిరిపోయే ట్విస్ట్స్ తో సాగే సీరియల్స్ అందిస్తున్న  జీతెలుగు మరోఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది.‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31, సరికొత్త సీరియల్ చామంతిని జనవరి 1న(బుధవారం) ప్రతిరోజు రాత్రి8:30 గంటలకు ప్రసారం కానుంది.

ఇటీవల ఖమ్మం వేదికగా జీ తెలుగు నిర్వహించిన న్యూ ఇయర్​ స్పెషల్​ ఈవెంట్​ సరిగమప పార్టీకి వేళాయెరా కార్యక్రమాన్ని 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్రసారం చేస్తోంది. యాంకర్​ రవి, లాస్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీగాయకులు జీ తెలుగు సీరియల్​ నటీనటులతో పోటీపడ్డారు. మేఘసందేశం సీరియల్​ నుంచిగగన్ (అభినవ్), భూమి (భూమిక),నిండునూరేళ్ల సావాసం సీరియల్​ నుంచిఅమరేంద్ర (రిచర్డ్జోస్), అరుంధతి (పల్లవిగౌడ),భాగమతి(నిసర్గగౌడ),చిరంజీవిలక్ష్మీసౌభాగ్యవతిసీరియల్​ నుంచి మిత్ర (రఘు), లక్ష్మి (మహిగౌతమి) తదితరులు పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.  హృదయాన్నిహత్తుకునే పాటలు, ఉల్లాసకరమైన ఆటలు, అద్భుతమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది. పాటల పోటీలు, కామెడీస్కిట్లు, అందాల పోటీలు నిర్వహించడమే కాకుండా ఈ వేదికపై ప్రతిభావంతులైన దివ్యాంగులను ప్రోత్సహించింది జీ తెలుగు. 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలుకుతూ అభిమానుల కోలాహలంతో సాగిన ఈ కార్యక్రమాన్ని మీరూ మిస్​ కాకుండా చూసేయండి.

చలాకీ అమ్మాయి అయిన చామంతి(మేఘనా లోకేష్​) తన కుటుంబంతో ఊరిలో జీవిస్తుంది. చామంతి కుటుంబం ఆ ఊరిలో జమీందారీ ఇంట్లో నమ్మకంగా పని చేస్తుంది. చామంతితండ్రి – రామచంద్రయ్య (ప్రభాకర్), తల్లి మూగ. చామంతి అక్క రోజా వాయుపుత్ర ఎయిర్​లైన్స్​లో ఎయిర్​ హోస్టెస్​గా పనిచేస్తుంది. ఇక జమీందారీ కుటుంబ సహాయంతో ఎదిగిన వ్యక్తి వాయుపుత్ర ఎయిర్​లైన్స్​ ఎండీ హర్షవర్ధన్. అరుణ్​, ప్రేమ్​ హర్షవర్ధన్​ వారసులు. పల్లెటూర్లో ఉండే చామంతి హైదరాబాద్​ ఎలా చేరుకుంది? చామంతి, ప్రేమ్​ మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? రోజా హర్షవర్ధన్​ ఇంటికి ఎలా చేరుకుంటుంది? వంటి​ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే చామంతి సీరియల్​ చూడాల్సిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *