వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి ‘చేతబడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగా, బాణామతి నేపథ్యంలో హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను, ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆయన మునుపెన్నడూ చూడని విధంగా హీరో, విలన్ ఛాయలున్న విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
ఎం3 మీడియా (M3 Media), మహా మూవీస్ (Maha Motion pictures) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్యాస్ దర్శకత్వం వహిస్తుండగా.. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం, అచ్చు రాజమణి సంగీతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అయితే, చిత్రీకరణకు ముందే ఐదు భాషల ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ ‘సరిగమ’ సొంతం చేసుకోవడం విశేషం. తెలుగులో ఒక పాట, మిగతా భాషల్లో వేరే పాటలతో ఒకే విజువల్స్ రావడం ఈ చిత్రానికి మరో హైలైట్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
The put up జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో ‘చేతబడి’.. ఆడియో హక్కులు సరిగమ సొంతం! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
