శ్రీ స్కంద హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై శరణ్య-సుధీక్ష సమర్పణలో కృతాక్షి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలపతి కుమార్ పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై, టీజర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని, హాస్య ప్రధానమైన ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించాలని కోరారు. దివంగత నటుడు ఏవీఎస్ కుమార్తె శాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషకరమన్నారు. హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ.. ఇదొక పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమని, ఒక సున్నితమైన అంశాన్ని దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారని తెలిపారు. ఈవీవీ, జంధ్యాల తరహాలో సినిమా నవ్విస్తుందని పేర్కొన్నారు.
చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని నటుడు అలీ కోరారు. ఈ సినిమాలో అలీ, రాజీవ్ కనకాల, కోటేశ్వరరావు, శృతి శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కే సంభాషణలు రాసిన ఈ చిత్రానికి బూసం మనోజ్ కుమార్ సంగీతం అందించగా, కిషోర్ బోయిడపు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
The submit ‘మన డాక్టర్ బాబే’ సినిమా టీజర్ విడుదల first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
