మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ డివోషనల్ కం ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ కోసం అందరికీ తెలిసిందే. మంచి బజ్ ని మొదటి నుంచి సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజ్ నుంచి ఒక ఊహించని సర్ప్రైజ్ కూడా ఉన్నట్టు సినీ వర్గాల నుంచి ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.
అతి త్వరలోనే సినిమా తాలూకా గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఇందులో రవితేజ నుంచి మాత్రం ఒక ఊహించని సర్ప్రైజ్ ఉండబోతుందట. తన లుక్ సహా పెర్ఫామెన్స్ లు కూడా ఇందులో ఊహాతీతంగా ఉంటాయని తెలుస్తుంది. సో రవితేజ నుంచి గట్టి కంబ్యాక్ నే ఇపుడు రాబోతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ ఒక సెన్సేషనల్ ఆల్బమ్ ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
The submit మాస్ మహారాజ్ తరపున ‘ఇరుముడి’లో క్రేజీ సర్ప్రైజ్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
