Sun. May 31st, 2026

తమిళ సినిమా దగ్గర మాత్రమే కాకుండా దక్షిణాది సినిమా దగ్గర మంచి స్టార్డం ఉన్న హీరోస్ లో స్టార్ నటుడు థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. అయితే సినిమాలు మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సాహసోపేత కార్యక్రమాలు ఎన్నో తాను చేశారు. ఇలా ప్రస్తుతం తనకి ఎంతో ఇష్టమైన రేసింగ్ లైఫ్ లో తాను బిజీగా ఉండగా ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ ని తమిళ సినీ ప్రముఖుల్ని దిగ్భ్రాంతికి లోను చేసింది.

ఇంతకీ అంతలా ఏం జరిగిందంటే అజిత్ మాతృమూర్తి మోహిని మణి ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్టు కోలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. దీనితో అజిత్ ఇంట తీవ్ర విషాదం ఇప్పుడు నెలకొంది. అయితే మోహిని మణి తన వయసు సంబంధించిన సమస్యలతోనే చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 85వ ఏట తుది శ్వాస విడిచినట్టు తెలుస్తుంది. ఈ వార్త విన్న కోలీవుడ్ సినీ ప్రముఖులు అన్నామలై, కమల్ హాసన్, ఎం కె స్టాలిన్ తదితరులు విచారం వ్యక్తం చేస్తూ ఆమె పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

The put up షాకింగ్: స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖుల దిగ్భ్రాంతి! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.