Wed. Apr 22nd, 2026
Rahasya Gorak: కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై.. రహస్య గోరఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, తన నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో, అదే సినిమాలో తనతో పాటు నటించిన రహస్య గోరఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రహస్య గోరఖ్ తన వైవాహిక జీవితం, తన భర్త కిరణ్ అబ్బవరం గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Additionally Learn : Peddi: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ అప్‌డేట్ వైరల్!

సాధారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలకు కొన్ని కలలు, ఊహలు ఉంటాయి. రహస్య కూడా పెళ్లికి ముందు తన భర్త గురించి కొన్ని సరదా ఆలోచనలు ఉండేవని బయటపెట్టారు. “పెళ్ళయ్యాక తను కష్టపడి సంపాదిస్తాడు, నేను హాయిగా ఖర్చు పెడతాను అనుకున్నాను” అంటూ ఆమె చమత్కరించారు. అయితే పెళ్లి తర్వాత కిరణ్ వ్యక్తిత్వం చూసి ఆమె ఆశ్చర్యపోయారట. కిరణ్ అబ్బవరానికి ఎప్పుడూ తన చుట్టూ జనం ఉండాలని, సందడి సందడిగా ఉండాలని కోరుకుంటారట. ఒంటరిగా ఉండటం కంటే పది మందితో కలిసి సంతోషంగా గడపడమే ఆయనకు ఇష్టమని రహస్య చెప్పుకొచ్చారు.

కిరణ్ అబ్బవరం కేవలం ఒక నటుడిగానే కాకుండా, తన కుటుంబానికి. స్నేహితులకు ఇచ్చే ప్రాధాన్యత గురించి ఆమె గొప్పగా వివరించారు. ‘అతనికి చుట్టూ జనం ఉండాలి, అందరితో కలిసి సందడి చేయాలి. ఇలాంటి పార్ట్నర్ దొరకడం నిజంగా అదృష్టం, ఇలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికీ ఉండాలి‘ అని ఆమె మనసులోని మాటను పంచుకున్నారు. కిరణ్ అబ్బవరం వ్యక్తిత్వం ఎంత సింపుల్‌గా, సోషల్‌గా ఉంటుందో రహస్య మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.