Wed. Apr 22nd, 2026
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’లో ఫుల్ లెంగ్త్ కామెడీ..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఈసారి ఆయన ‘కొరియన్ కనకరాజు’ అనే విభిన్నమైన టైటిల్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వరుణ్ తేజ్ కనకరాజు అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తికి కొరియా దేశంతో సంబంధం ఏంటి? అసలు ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు? అనే పాయింట్ మీద సినిమా నడుస్తుందట. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా.. తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

Allso Learn : The Paradise: అనిరుధ్ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ అదిరిపోయిందిగా..!

ఈ సినిమాలో మేర్లపాక గాంధీ ఒక అద్భుతమైన కామెడీ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారట. సినిమా ప్రీ-క్లైమాక్స్ సమయంలో వచ్చే ఈ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వుల విందు పంచనుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ మార్క్ టైమింగ్‌కు గాంధీ మేకింగ్ తోడై, ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ‘వెంకీ మామ’ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.