Wed. Apr 22nd, 2026

విజయ్ దేవరకొండ మరియు ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ కథను దర్శకుడు శౌర్యువ్ మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశాడట. ఎన్టీఆర్‌కు కథ నచ్చినప్పటికీ, ఆయన ‘దేవర’, ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరక ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ చెంతకు చేరినట్లు సమాచారం.

ఒక పెద్ద స్టార్ హీరో చేయాల్సిన కథ విజయ్ దగ్గరకు రావడంతో, దర్శకుడు హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేశాడట. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ వేరు, విజయ్ స్టైల్ వేరు కాబట్టి, ఆ మార్పులు సినిమాకు కొత్త ఫ్లేవర్‌ను ఇస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు శౌర్యువ్ మార్క్ బలమైన ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయి.

విశేషమేమిటంటే, విజయ్ దేవరకొండ ఇలా స్టార్ హీరోలు వదులుకున్న కథలతో సినిమాలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో గౌతమ్ తిన్ననూరి చిత్రం కూడా మొదట రామ్ చరణ్‌తో అనుకున్నదే. ఇప్పుడు ఎన్టీఆర్ వదులుకున్న పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో విజయ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

The submit ఎన్టీఆర్ చేయాల్సిన కథతో రౌడీ స్టార్..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.