మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పెద్ది పెహల్వాన్ పాత్రలో రామ్ చరణ్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో ఈ సినిమా పై దర్శకుడు బుచ్చిబాబు సానా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.
తాజాగా చిత్ర షూటింగ్ సెట్స్ నుండి రామ్ చరణ్‌తో బుచ్చిబాబు కలిసి ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేశారు. ఈ ఫోటోల్లో రామ్ చరణ్ సెల్ఫీ తీస్తుంటే, బుచ్చిబాబు సానా గర్వంగా నిల్చున్న పిక్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫోటోలకు బుచ్చిబాబు ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చాడు. పెద్ది సెట్స్‌లో చివరి 6 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. తనకు ఎంతో స్పూర్తినిచ్చిన పాత్ర.. తాను ఎంతో ప్రేమించే పెద్ది అంటూ ఆయన ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ నెలలో వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Ultimate 6 days on #Peddi units
My most galvanizing persona…
My cherished Peddi @AlwaysRamCharan Sir pic.twitter.com/d9SF2FR2kX— BuchiBabuSana (@BuchiBabuSana) April 21, 2026
The submit ఫోటో మూమెంట్ : తనకు స్పూర్తినిచ్చిన పాత్ర.. తాను ప్రేమించే పెద్ది తో బుచ్చిబాబు first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
