Tue. Apr 21st, 2026

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా కలయిక కూడా ఒకటి. వారి కలయికలో చేస్తున్న పెద్ది సినిమా మంచి స్టాండర్డ్స్ ఇప్పుడు సెట్ చేయగా ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కలయికలలో ఓ సినిమా ఉంటుంది అని బజ్ వినిపించింది. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న వీరి కలయిక నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మాత్రం ఒక సెపరేట్ జానర్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం బుచ్చిబాబు ఈసారి రామ్ చరణ్ తో ఇతిహాసాల బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తాడని వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి సాలిడ్ డివోషనల్ సబ్జెక్టు పడితే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి దానిని బుచ్చినే తీసుకొస్తాడా లేదా మరో దర్శకుడు చేస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి.

The publish ‘పెద్ది’ కాంబినేషన్లో ఈసారి ఊహించని జానర్? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.