మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్ డేట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ, ఈ చిత్రాన్ని మేకర్స్ జూన్ 2026కి వాయిదా వేశారు. ఇక షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం అవసరమవ్వడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణాలలో ఒకటి ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ షూటింగ్. ఈ స్పెషల్ సాంగ్‌లో రామ్ చరణ్‌తో కలిసి చిందులేసేందుకు మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఎంపికైనట్లు సమాచారం. ఈ పాట షూటింగ్ రేపటి నుండి వనస్థలిపురంలో ప్రారంభం కానుంది. చరణ్ మాస్ డ్యాన్స్‌కు, సంయుక్త గ్లామర్ తోడవ్వడంతో ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు మరియు బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
The put up పెద్ది స్పెషల్ సాంగ్ షూటింగ్‌కు సర్వం సిద్ధం.. సెట్స్‌లో జాయిన్ అయ్యేది ఎవరంటే..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
