Tue. Apr 21st, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్స్ ఇప్పుడు బయటకి వచ్చాయి. ఎన్టీఆర్ పై ఒక ప్రీ లుక్ పోస్టర్ లాంటిది సిద్ధం చేసి సినిమా తాలూకా రిలీజ్ డేట్ ని ఇందులో రివీల్ చేశారు.

వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఇక దీనితో పాటుగా సినిమా తాలూకా ఫస్ట్ గ్లింప్స్ పై కూడా అవైటెడ్ క్లారిటీ ఇచ్చేసారు. దీనిని ఈ మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు. సో ఇది మాత్రం అభిమానులకి ఒక బ్లాస్టింగ్ సర్ప్రైజ్ అని చెప్పి తీరాలి. మరి ఈ రానున్న గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The put up NTR NEEL బిగ్ అప్డేట్: పవర్ఫుల్ పోస్టర్ తో రిలీజ్ డేట్, ఫస్ట్ గ్లింప్స్ డేట్స్ వచ్చేశాయ్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.