Tue. Apr 21st, 2026

మన టాలీవుడ్ యువతకి బాగా నచ్చిన పలు ఎంటర్టైనర్ చిత్రాల్లో ఈ నగరానికి ఏమైంది కూడా ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా గత 2018లో వచ్చి అప్పుడు థియేటర్స్ లో ఆకట్టుకోకపోయినా తర్వాత మాత్రం కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా తాలూకా షూట్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. తాజాగా చిత్ర యూనిట్ షేర్ చేసుకున్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఇందులో వివేక్ అండ్ గ్యాంగ్ తమ కార్ లో కలిసి మరో రైడ్ లో చిల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇది థాయిలాండ్ లో అన్నట్టు కూడా తెలిపారు. సో ఈసారి గోవా నుంచి థాయిలాండ్ కి వీళ్ళ రచ్చ షిఫ్ట్ అయ్యింది అని చెప్పవచ్చు. సో ఈసారి ఎంటర్టైన్మెంట్ డోస్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The put up ENE 2: వివేక్ అండ్ గ్యాంగ్.. ఈసారి థాయిలాండ్ లో రచ్చ! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.