Wed. Apr 22nd, 2026

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ (Fort) సీజన్ 2 విడుదలకు రంగం సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ ట్రైలర్‌ను వదిలింది. 2026 మే 6న ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొదటి సీజన్‌లో గూఢచార సంస్థ ‘సిటాడెల్’ నాశనం కాగా, రెండో సీజన్‌లో మాజీ ఏజెంట్లు నదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా), మేసన్ కేన్ (రిచర్డ్ మ్యాడెన్) మళ్లీ ఏకమై ‘మాంటికోర్’ అనే విద్రోహ సంస్థతో పోరాడనున్నారు. ఈసారి మరింత మంది కొత్త ఏజెంట్లను కలుపుకుని, మానవాళిని రక్షించేందుకు వీరు చేసే సాహసాలు సిరీస్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి.

రూసో బ్రదర్స్ నిర్మాణంలో డేవిడ్ వెయిల్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్, మే 6న అన్ని ఎపిసోడ్లు ఒకేసారి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఉన్న క్యాస్టింగ్‌తో పాటు మెర్లే డాండ్రిడ్జ్ వంటి కొత్త యాక్టర్స్ కూడా ఈ సీజన్‌లో సందడి చేయబోతున్నారు. పక్కా యాక్షన్ అండ్ ఇంటెలిజెన్స్ డ్రామాగా రాబోతున్న ఈ సిరీస్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit ఓటీటీ క్రేజీ సిరీస్.. సీజన్ 2 డేట్ ప్రకటించిన ‘సిటాడెల్’ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.