జస్ట్ కొన్ని రోజుల కితమే కోలీవుడ్ నుంచి అవైటెడ్ సినిమా జన నాయగన్ తాలూకా ఫుటేజ్ ఇంకా థియేటర్స్ లో రిలీజ్ కాకుండానే ఆన్లైన్ లోనే లీక్ అయ్యి కలకలం రేపింది. దీనితో మేకర్స్ భారీ నష్టం చూసారు. మరి ఇది మరిచే లోపే మరో బిగ్గెస్ట్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సెన్సేషనల్ మాస్ సీక్వెల్ సినిమా జైలర్ 2 ఫుటేజ్ కూడా ఆన్లైన్ లో లీక్ అయ్యింది అంటూ ఓ టాక్ సోషల్ మీడియాలో ఇప్పుడు షాకింగ్ గా మారింది.
అయితే ఇందులో అసలు నిజం లేనట్టే తెలుస్తోంది. లీక్ అయ్యింది అనే టాక్ ఉంది కానీ ఫుటేజ్ వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. సో తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేస్తున్నారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు, సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న విషయం తెలిసిందే.
The publish షాకింగ్: ‘జైలర్ 2’ ఫుటేజ్ కూడా లీక్? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
