Fri. Apr 17th, 2026

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ఫౌజీ కూడా ఒకటి. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఇది పేట్రియాట్ సినిమా అయినప్పటికీ ప్రభాస్ పై డిజైన్ చేసుకున్న ఎలివేషన్స్ కానీ కొన్ని ఎలివేషన్ ఎపిసోడ్స్ గాని నెక్స్ట్ లెవెల్లో దర్శకుడు హను రాఘవపూడి డిజైన్ చేసుకున్నరాట.

ఇన్నాళ్లు హను లోని సాఫ్ట్ యాంగిల్ కనిపిస్తే ఈసారి మాత్రం ప్రభాస్ లాంటి కటౌట్ ని పెట్టుకొని ఏం చెయ్యాలో ఎలా చూపించాలో అందుకు తగ్గట్టుగానే పూర్తి భిన్నమైన సాలిడ్ మాస్ సీన్స్ ని తాను ప్రెజెంట్ చేయబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. సో హను రాఘవపూడి తన మాస్ చూపించనున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The publish ‘ఫౌజీ’ ఇలాంటి ట్రీట్ బోలెడు..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.