ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ ధరల హైక్ లు మరియు ముందు రోజే ప్రీమియర్స్ ఉంటాయని టాక్ వచ్చింది.
అలాగే ముందస్తుగా ఏపీలోనే టికెట్ ధరల నిర్ణయం, ప్రీమియర్ షోస్ టైమింగ్ కూడా ఖరారు అయ్యింది అని ఆల్రెడీ తెలిపాము. ఇప్పుడు దానికి అధికారిక జీవో కాపీ వచ్చేసింది. దీని ప్రకారం ఏపీ ప్రభుత్వం పెద్ది సినిమా జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ షోస్ కి అనుమతులు ఇవ్వగా ఈ షోస్ కి గాను టికెట్ ధర 600 గా నిర్ణయించారు.
ఇక రెగ్యులర్ రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ అయితే 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 125 రూపాయలు అదనంగా మొత్తం 10 రోజుల పాటుగా పెంచారు. సో ఏపీలో పెద్ది సినిమాలో లైన్ క్లియర్ గా ఉందని చెప్పవచ్చు. ఈ జూన్ 1 నుంచే ఏపీలో కూడా టికెట్ బుకింగ్స్ మొదలు కానున్నాయని సమాచారం. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The submit అఫీషియల్: ఏపీలో ‘పెద్ది’ ఆట షురూ.. ప్రీమియర్స్, టికెట్ ధరల డీటెయిల్స్ వచ్చేశాయ్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
