సమంత హీరోయిన్‌గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కాగా తాజాగా ఈ సినిమా గురించి స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ మాట్లాడుతూ.. ఒక రోజు సాయంతం మా అమ్మకి కాల్ చేస్తే, ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్ లో వున్నాను అన్నారు. లేడీస్ కదిలితే ఆ సినిమా రెవెన్యూనే వేరు. భారీగా కలెక్షన్స్ వస్తాయి.
‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది’ అని నాగవంశీ తెలిపారు. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం, టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా అధికారికంగా నిలిచింది. ఇక ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్నట్టు మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
The submit లేడీస్ కదిలితే ఆ సినిమాకి వచ్చే కలెక్షన్సే వేరు – నాగవంశీ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
