Mon. Jul 6th, 2026

‘హిట్’ సిరీస్ మరియు ‘సైంధవ్’ చిత్రాలతో టాలీవుడ్‌లో విలక్షణమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను తన కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇప్పటివరకు వెండితెరపై తన కథలతో మెప్పించిన ఆయన, ఇప్పుడు పుస్తక రచయితగా కొత్త అవతారమెత్తబోతున్నాడు.

సోమవారం నాడు సరస్వతి పూజతో ఆయన తన సరికొత్త పుస్తక రచనకు సంబంధించిన పనులను అధికారికంగా ప్రారంభించాడు. తన హృదయానికి ఎంతో నచ్చిన, అలాగే తన జీవితాన్నే మార్చేసిన ఒక అద్భుతమైన కథను ఆయన ఈ పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నట్లు సమాచారం.

దర్శకుడిగా విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్స్ అందించిన శైలేష్ కొలను, రచయితగా రాయబోయే ఈ మొదటి పుస్తకంతో కూడా సరికొత్త విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

The publish కొత్త అవతారమెత్తిన ‘హిట్’ డైరెక్టర్.. ఈసారి చదివిస్తాడట..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.