Mon. Jul 6th, 2026

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఈ సినిమా జులై 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసిన ఒక ఆసక్తికరమైన కొత్త పోస్టర్ అభిమానులలో ఉత్కంఠను రేకెత్తించింది. ఈ పోస్టర్‌లో కేవలం ఒక పులి మరియు ‘లెనిన్’ టైటిల్ లోగో మాత్రమే ఉన్నాయి. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడంతో పాటు కథను వివరిస్తుండటమే దీనికి కారణం అని తెలుస్తోంది.

అందుకే, ఆయన వాయిస్ ఓవర్ ను సూచించేలా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రమోద్ పంజు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వచ్చిందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.

The publish ‘లెనిన్’ కోసం జూనియర్ ఎన్టీఆర్.. పోస్టర్ రిలీజ్ ! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.