ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూలై 5, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ 2.75/5
నటీనటులు : చాందిని చౌదరి, ఆదిత్య బాబు, సీవీఎల్ నరసింహారావు, మాధవి, సన
దర్శకత్వం : రామ్ మన్నార్
నిర్మాతలు : ప్రవీణ్ కడియాల, అనీల్ కడియాల
సంగీతం : ఎస్ సుహాస్
ఛాయాగ్రహణం : వై ఆర్ కృష్ణ
కూర్పు : బాబు శృంగవరపు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే ‘డిజిటల్ డెత్’. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రం కథా సుధలో ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
హైదరాబాద్ లో డేటా అనలిస్ట్ గా పని చేసే సత్య కుమారి (చాందిని చౌదరి) తన వృత్తి పరంగా అమెరికా వెళ్లాలని కలలు కంటుంది. ఈ సమయంలో తన తల్లికి బాలేదు అని తన తండ్రి నుంచి వచ్చిన కాల్ తో హాస్పిటల్ ఖర్చులు కోసం డబ్బులు పంపుతా అని చెప్పి ఫోన్ నుంచి పంపే యత్నం చేస్తుంది కానీ ఎన్ని సార్లు ట్రై చేసినా అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు అని ఆరా తీస్తే ఆమె డిజిటల్ గా చనిపోయింది అని తెలుస్తుంది. ఒక పక్క తల్లి ఆరోగ్యం, సరిగా అదే రోజు తన కలకి దగ్గరయ్యే అమెరికా ప్రయాణం. ఈ రెండిట్లో ఆమె ఎటు వైపు వెళ్ళింది? అసలు ఈ డిజిటల్ గా చనిపోవడం ఏంటి? దీని నుంచి ఆమె ఎలా బయటపడింది అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈటీవీ విన్ కథా సుధలో రెగ్యులర్ అండ్ రొటీన్ కథలకి భిన్నంగా ఇది ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో కనిపిస్తుంది. అసలు డిజిటల్ గా ఓ మనిషి చనిపోవడం ఏంటి అనే కొత్త పాయింట్ ని దర్శకుడు పట్టుకున్నపుడే మంచి మార్కులు కొట్టేసారు. అదే విధంగా ఈ లైన్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న కొన్ని సీన్స్ డీసెంట్ గా సాగుతాయి.
ఇందులో మళ్ళీ ఎమోషన్ ని కూడా జోడించడం కథనం మరింత ఇంట్రెస్ట్ గా కొద్ది నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇక నటీనటుల్లో చాందిని చౌదరి తన రోల్ లో బాగా సెట్ అయ్యింది. ట్రెండీ యువతిగా అలాగే తన తల్లిదండ్రుల పట్ల ప్రేమని కనబరిచే కూతురిగా ఆకట్టుకుంది.
తనతో పాటుగా యువ నటుడు ఆదిత్య బాబు కూడా బాగా నటించాడు. వీరితో పాటుగా సీవీఎల్ నరసింహారావు, మాధవి, సన తదితరులు తమ పాత్రల్లో బాగా నటించారు. వీటితో పాటుగా ఇచ్చిన పాజిటివ్ ఎండింగ్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఇది లఘు చిత్రం అని ఎక్కువ కదా అని ఎక్కువ డీటెయిల్స్ ని చాలా తక్కువ సమయంలో చూపించేసే ప్రయత్నం చేశారు. ఇందులో కథనం మంచి స్పీడ్ గా నడిపించే ప్రయత్నంలో ఈ డీటైలింగ్ ఒకింత రియాలిటీకి కొద్దిగా దూరంగా ఉంటుంది.
ఒక్క రోజులో కాదు కేవలం గంటల్లోనే హీరోయిన్ రోల్ ఆఫీస్ అని బ్యాంకు అని డాక్టర్ అని ఆధార్ ఆఫీస్ ఇలా సిటీలో చేసేస్తూ ఉండడం రియాలిటీకి దూరంగా అనిపిస్తాయి.
అలానే డిజిటల్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని వీరు కూడా టెక్నాలజీని బాగానే వాడారు చాలా షాట్స్ లో ఏఐ తో చాలా నాచురల్ గా చూపించే ప్రయత్నం చేశారు కానీ ఆర్గానిక్ కథనం విజువల్స్ లో ఇవి కొంచెం కృత్రిమంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ బాగానే ముగిసింది అనుకునే టైం లో లీడ్ జంట నడుమ లవ్ ట్రాక్ ని చిన్నగా పెట్టడం ఫోర్స్డ్ గా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సెటప్ ఓకే అనిపిస్తుంది కానీ ఆ ఏఐ విజువల్స్ ట్రై చేయకుండా ఉండాల్సింది. సంగీతం బాగుంది. కెమెరా వర్క్ మాత్రం బాగా చేశారు. కొన్ని షాట్స్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు రామ్ మన్నార్ విషయానికి వస్తే.. తన వర్క్ బాగుందని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని పట్టుకున్నారు. బహుశా తనకి ఉన్న లిమిటేషన్స్ లో చేశారేమో కానీ కొన్ని అంశాలు పక్కన పెడితే తన వర్క్ ఈ లఘు చిత్రంలో బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘డిజిటల్ డెత్’ అనే లఘు చిత్రం ఓ కొత్త కాన్సెప్ట్ ని చిన్న ఇంట్రెస్ట్ ని కలిగిస్తుంది. అలా కొంచెం ఎమోషన్ ని కూడా జోడించి దర్శకుడు నడిపించిన తీరు డీసెంట్ గా అనిపిస్తుంది. చాందిని తదితరులు కూడా బాగా చేశారు. కొన్ని అంశాలు లాజిక్ కి దూరంగా ఉన్నాయి కానీ వీటిని పక్కన పెడితే కొత్త కాన్సెప్ట్ ని డీసెంట్ కథనంతో కోరుకునేవారిని ఇది మెప్పిస్తుంది.
123telugu.com Ranking: 2.75/5
Reviewed via 123telugu Crew
The publish ఓటిటి సమీక్ష: ‘డిజిటల్ డెత్’ – చాందిని చౌదరి నటించిన తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
