Mon. Jul 6th, 2026
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సౌత్ సినిమాలు..

Theatrical Releases: ప్రతి వారం లాగే ఈసారి కూడా దక్షిణాది చిత్రసీమలో విభిన్న జానర్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. యాక్షన్, రొమాన్స్, హారర్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్, పౌరాణిక కథలు ఇలా ప్రతి అభిరుచికి తగ్గ సినిమాలు జూలై 9, 10 తేదీల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’, ‘వసుదేవ సుతం’ వంటి చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ పలు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

 I, No person

‘ఐ, నోబడీ’ కథ రాజీవన్ అనే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నిసామ్ బషీర్ తెరకెక్కించిన ‘I, No person’ జూలై 9న విడుదల కానుంది. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అనుకోకుండా ఓ క్రిమినల్ కుట్రలో చిక్కుకుని తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు చేసే పోరాటమే ఈ యాక్షన్ డ్రామా కథాంశం. పృథ్వీరాజ్ సుకుమారన్ , పార్వతి తిరువోతు, హక్కీం షాజహాన్, అశోక్, విజయరాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ యాక్షన్ డ్రామాకు నిసామ్ బషీర్ దర్శకత్వం వహించారు.

2. Boys By no means Compromise

‘బాయ్స్ నెవర్ కాంప్రమైజ్’ కథ ఎనిమిది మంది అల్లరి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీరు తమ రోజువారీ బాధ్యతలను పక్కనపెట్టి, మద్యం మత్తులో ఒక పర్వత యాత్రకు బయలుదేరతారు. అక్కడ మర్మమైన అతీంద్రియ శక్తులను వారు ఎదుర్కొన్నప్పుడు, వారి సరదా త్వరలోనే ఒక పీడకలగా మారుతుంది. అక్కడి నుంచి వీళ్ళు బయట పడ్డారా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సామ్రాట్ పరీక్షిత్ భాస్కర్, సుప్రీత్ కాటి, షైనింగ్ సీతారాం, సిద్దు మాండ్య, హేమంత్ నాగ్ గౌడ, ఉమేష్ కిన్నాల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ కన్నడ హారర్ కామెడీకి హరీష్ టి జల్గేరే దర్శకత్వం వాహంచారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో అడుగుపెట్టబోతోంది.

3. Love Oh Love (LoL)

‘లవ్ ఓ లవ్’ కథ రఘువరన్ అనే ఒక కార్పొరేట్ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. అతని ప్రియురాలు అవంతిక విపరీతమైన ఖర్చు అలవాట్ల కారణంగా, అతను తన ఉద్యోగాన్ని కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోయి, కుటుంబం నుంచి కూడా వెలివేయ బడతాడు. ఆ బంధాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన అతనికి, ఆమె మాత్రం వదలడానికి నిరాకరిస్తుంది. దాంతో అతను, నాలుగు నెలల పాటు వారి బంధంలో తాను అనుభవించిన ఒత్తిడిని ఆమెను కూడా అనుభవించమని సవాలు విసురుతాడు. అవంతిక ఆ సవాలును స్వీకరిస్తుందా, వారిద్దరూ నిజమైన ప్రేమను తిరిగి కనుగొంటారా అనేదే ఈ కథలో హైలెట్ గా ఉంటుంది. ఇందులో పవిష్ నారాయణ్, నాగ దుర్గ, సెల్వరాఘవన్, రవికుమార్ కూడువంచెరి సాంబశివం, వనిత విజయకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు మాగేష్ రాజేంద్రన్ తెరకెక్కించన ఈ తమిళ రొమాంటిక్ కామెడీ జూలై 10న రిలీజ్ కానుంది.

4. Mudharkanal

ఒక ప్రతిభావంతుడైన యువకుడి జీవితం, చెడ్డ స్నేహితుల వల్ల వ్యసనానికి లోనై విషాద మలుపు తీసుకోవడమే ‘ముదర్కనల్’ కథ. తన జీవితాన్ని తిరిగి గాడిలో పడటానికి వచ్చిన చివరి అవకాశాన్ని అతను ఎలా నిలబెట్టుకున్నాడనేదే ఈ సినిమా కథ. అశ్విన్, హరికృష్ణన్, ఇలక్కియ, డి. రాజేంద్రన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ తమిళ డ్రామాను దర్శకుడు ఆర్. వెంకటరమణన్ తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 9న రిలీజ్ కాబోతోంది.

5. Lenin

అఖిల్ అక్కినేని , భాగ్యశ్రీ బోర్సే, శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ఈశ్వరి రావు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ‘లెనిన్’. ఈ యాక్షన్ జూలై 10న థియేటర్ లలో అడుగుపెట్టబోతోంది. రాయలసీమ ప్రాంత నేపథ్యంలో సాగే ఈ చిత్రం, కుటుంబ కలహాలు, ప్రతీకారం, ప్రేమ కథ వంటి ఎలిమెంట్స్ తో ఉండబోతోంది.

6. Vasudeva Sutham

మహేంద్రన్, అంబికా వాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, రాజీవ్ కనకాల, సురేష్ చంద్ర మీనన్ నటించిన పౌరాణిక యాక్షన్ డ్రామా Vasudeva Sutham కూడా జూలై 10న రాబోతోంది. ఈ కథ తమ స్వప్రయోజనాల కోసం ఒక శక్తిని నియంత్రించాలనుకునే వారి నుండి కాపాడటానికి కథానాయకుడు జరిపే పోరాటమే ఈ ‘వసుదేవ సుతం’.అలాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘Good looks’ కూడా అదేరోజు రానుంది.  భరతనాట్య నర్తకి జీవితంలో జరిగిన విషాదం చుట్టూ కథ తిరుగుతుంది.  మొత్తంగా చూస్తే ఈ వారం థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు విడుదలవుతున్నాయి. భారీ అంచనాల మధ్య వస్తున్న ‘లెనిన్’, పృథ్వీరాజ్ నటించిన ‘I, No person’తో పాటు మిగతా చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా అభిమానులకు ఈ వీకెండ్ పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.