Tue. Jul 7th, 2026

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కాస్త ఆలస్యమవుతుండటంతో, నాని ఈ గ్యాప్‌లో తన నెక్స్ట్ చిత్రాల లైనప్‌ను సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగానే ‘ది ప్యారడైజ్’ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ సినిమాను ఆయన ఇప్పటికే లైన్‌లో పెట్టాడు.

ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా నానితో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్న ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి తాజాగా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ సమాచారం. వెంకీ అట్లూరి చెప్పిన ఫైనల్ నరేషన్ నానికి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు టాక్.

ప్రస్తుతం వెంకీ అట్లూరి హీరో సూర్యతో చేస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ పనుల్లో బిజీగా ఉండగా.. అటు సుజీత్ కూడా ‘ఓజీ 2’ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నాడు. మరి నాని-వెంకీ అట్లూరి కాంబినేషన్ మూవీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

The submit మరో డైరెక్టర్‌తో నాని నెక్స్ట్ మూవీ లాక్..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.